calender_icon.png 10 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

10-09-2025 12:39:36 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అరెస్టు చూపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న యువతిని ఆమె తల్లిదండ్రులు ఈనెల 6న కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు.

అదే ఆసుపత్రిలో కాంపౌండర్/ఓటీ టెక్నీషియన్గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ది దక్షన్ మూర్తి (23) అనే వ్యక్తి రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో, అతను వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి వెంటనే ఆసుపత్రికి వెళ్లి సాక్షులను విచారించారు. టెక్నికల్ ఆధారాలను సేకరించారని అన్నారు. ఆధారాలన్నీ పరిశీలించిన తరువాత నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపారు.

నిందితుడు తరచుగా అశ్లీల వ్బుసైట్లు చూస్తూ, మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడు అని తెలిపారు.  ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలు కావద్దనిసిపిసూచించారు.