calender_icon.png 10 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఎండీ గేట్ల ఎత్తివేత

10-09-2025 12:37:22 AM

తిమ్మాపూర్ సెప్టెంబర్ 9 విజయ క్రాంతి: కరీంనగర్ పరిధిలోని ఎల్ ఎం డి జలాశ యం నిండుకుండలా మారడంతో మంగళవారం మానకొండూరు ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అధికారులతో కలిసి గేట్లను ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసి న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి మిడ్ మానేరు, మోయ తుమ్మెద, వాగుల నుంచి రిజర్వాయర్ లోకి ఇన్ఫ్లో రావడంతో 24 టీఎంసీలగాను 23.516 టిఎంసి నీటిమ ట్టం ఉంది.

కాగా మిడ్ మానేరు నుంచి 76 16 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండి రిజర్వాయర్ లోకి వస్తుంది. క్రమక్రమంగా రిజర్వాయర్ లోకి గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నేపథ్యంలో వరంగల్ ప్రధాన కాకతీయ కా లువ ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని వి డుదల చేయగా 2 గేట్లను ఎత్తి దిగువకు 40 00 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

అ నంతరం ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్‌ఎండి రిజర్వాయర్ లోకి ఇన్ఫ్లో వస్తున్న నేప థ్యంలో దిగువలో ఉన్న రైతాంగానికి నీరుని విడుదల చేశామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలాం, లతోపాటు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.