16-08-2025 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
తెలుగు వారికి ‘విమర్శ’ అనే పదం కొంత ఇబ్బంది కల్గిస్తుంది. అతడు విమర్శిస్తున్నాడంటే, తిడుతున్నాడని అర్థం చేసుకుంటారు. కానీ సదసద్వివేకమే విమర్శ. సతార్కికంగా ఒక విషయానికి సంబంధించిన మంచి చెడ్డలను విశ్లేషించడమే విమర్శ. ఆచార్య రామారావుగారు ‘విమర్శ’ పాఠం చెప్పినా, ‘విమర్శకులనిపించుకున్నా వారెన్నడూ తెలుగు వారనుకున్నట్లు ఎవరినీ దూషించి ఎరుగరు. విద్యార్థులను కూడా మిత్రులుగా చూసే సౌజన్యం వారిది.
తెలుగు విమర్శ అనగానే ఆచార్య ఎస్వీ రామారావుగారి పేరు గుర్తుకు వస్తుంది. తెలుగులో సాహిత్య విమర్శకు రామారావుగారు ఒక దీపస్తంభం లాగా నిలిచారు. నాకు ఎంఏ తెలుగులో వారు ప్రత్యక్ష గురువులు. వారి పాఠాలు స్వయంగా వినే అదృష్టం కల్గింది. సరళస్వభావులైన రామారావు గారు తోటి ఆచార్యులతో ఎంత సఖ్యంగా ఉండేవారో, విద్యార్థులతోనూ అంతే సఖ్యంగా ఉండేవారు. తెలుగు వారికి ‘విమర్శ’ అనే పదం కొంత ఇబ్బంది కల్గిస్తుంది.
అతడు విమర్శిస్తున్నాడంటే, తిడుతున్నాడని అర్థం చేసు కుంటారు. కానీ సదసద్వివేకమే విమర్శ. సతార్కికంగా ఒక విషయానికి సంబంధించిన మంచి చెడ్డలను విశ్లేషించడమే విమర్శ. ఆచార్య రామారావుగారు ‘విమర్శ’ పాఠం చెప్పినా, ‘విమర్శకులనిపిం చుకున్నా వారెన్నడూ తెలుగు వారనుకున్నట్లు ఎవరినీ దూషించి ఎరుగరు. విద్యా ర్థులను కూడా మిత్రులుగా చూసే సౌజన్యం వారిది. ఎం. ఏ మొదలుకొని పిహెచ్.డి దాకా ఆచార్య రామారావు గారి కి నేను శిష్యునిగానే ఉన్నాను.
ఇప్పటికీ నేను వారికి శిష్యుడినే. భాగ్యవశాన నేను 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఉపన్యాసకునిగా చేరాను. వారికి సహచరుణ్ణి అయ్యాను. అంతే కాదు వారు నాకు బోధించిన సాహిత్య విమర్శనే విద్యార్థులకు బోధించే అవకాశం నాకు లభించింది. వ్యాకరణం, ప్రాచీన కవిత్వం, భాషా శాస్త్రంతో పాటు విమర్శ నాకు బోధనాంశాలుగా ఉండేవి.
ఆచార్య ఎస్వీ రామారావుగారి ప్రేరణతో ‘ఆచార్య రామిరెడ్డి దూర విద్యా కేంద్రం’ పక్షాన జరిగే పరీక్షలకు గాను విమర్శకు సంబంధించి పాఠాలు తయారు చేసే అవకాశం నాకు లభించింది. ఆచార్య రామారావు గారు చేసే ప్రసంగాలు గానీ వ్రాసే వ్యాసా లు గానీ విషయాన్ని సూటిగా తెలియజేసే విధంగా ఉండేవి. వారెక్కువగా సాహిత్య విమర్శకు సంబంధించిన గ్రంథాలే రచించారు.
నామీద వ్యాసం రాయడం అదృష్టం
‘తెలుగులో సాహిత్య విమర్శ’ అనే గ్రం థంతో పాటు తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర’ అనే గ్రంథం విశిష్టమైంది. ఆచార్య రామారావుగారి కలం నుండి ఇప్పటి దాకా 35 గ్రంథాలు, శతాధిక వ్యాసాలు వెలువడినాయి. నా మీద వారు ‘మూసీ’లో ఒక వ్యాసం రాయడం నా అదృష్టం గా భావిస్తాను. ఆచార్య రామారావుగారు తెలుగు శాఖ అధ్యక్షులుగా, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. వీరే పదవిని అలంకరించినా ఆ పదవికే వారు అలంకారంగా ఉన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా వారు అందించిన సేవలు గణనీయ మైనవి, స్తుతింపదగినవి. 1990లో వారు ‘తెలుగు అధ్యాపక సంఘం’ ఏర్పాటు చేసి తెలుగు పండితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చినారు. ఆ సంఘానికి వారధ్యక్షులుగా నేను కార్యదర్శిగా ఉండటం జరి గింది. తెలుగు శాఖలో ఎవరు పరిశోధన చేయాలన్నా ఆచార్య రామారావుగారిని సంప్రదించక తప్పదు. తెలుగు శాఖలో ఎవరు పరిశోధన చేయాలన్నా ఆచార్య రామారావు గారినే సంప్రదించేవారు.
వారికి ఏయే విశ్వవిద్యాలయాల్లో ఏయే అంశాలమీద పరిశోధన జరిగిందో తెలుసు. నేను 1983లో ఎం. ఫిల్ డిగ్రీ తీసుకున్న తర్వాత పిహెచ్. డి కోసం ఏ అంశం తీసుకుంటే బాగుంటుందని కొంత మేరకు మథన పడ్డాను. నాకు ప్రాచీన సాహిత్యమంటే చాలా ఇష్టం. కానీ విశ్వవిద్యాలయంలో ఎక్కువగా ఆధునిక సాహి త్య ప్రకియలమీద పరిశోధన జరుగుతుంది. నాకు ఒక అంశాన్ని సూచించండి పిహెచ్. డికి అని మొదట ఆచార్య రవ్వా శ్రీహరిగారినడిగాను.
వారు ఆచార్య రామారావుగారిని సంప్రదిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక్కడ నాకొక ఇబ్బంది ఏర్పడింది. ఎం. ఫిల్ మేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్ఞయం మీద చేశాను. ఆచార్య మేటూరి ఆనంద మూర్తిగారు పర్యవేక్షకులు. ఆచార్య ఆనంద మూర్తిగారు నన్ను మంచి విద్యార్థిగా భావించి నారో ఏమో, పిహెచ్. డి కూడా తన పర్యవేక్షణలో ‘వేటూరి సమగ్ర సాహిత్యం’ మీద చేయమని సూచించారు. కానీ అదే సమయంలో పోచిరాజు శేషగిరిరావు, వేటూరి మీద పిహెచ్. డి పూర్తి చేసినట్లు తెలిసింది కనుక ఆనందమూర్తి గారి మాటను జవదాటవలసి వచ్చింది. కానీ వారినే పర్యవేక్షకులుగా వరించాను.
ఆయనంటే అందరికీ గౌరవమే..
సార్ ! మీరు ప్రాచీన సాహిత్యం మీద పిహెచ్. డి చేయడానికి ఒక అంశాన్ని సూచించండి’ అని రామారావు గారిని అడిగాను. వారు వెంటనే ‘మీరు పూర్తిగా గ్రామీణ జీవనానికి అలవాటుపడినవారు. ‘ప్రాచీన కావ్యాల్లో గ్రామీణ జీవనచిత్రణ’ అనే అంశం మీద పరిశోధన చేయండి అ ని సూచించారు. నేను గురువులంటే భయ మూ, భక్తి కలిగిన వాణ్ణి. వేటూరి ఆనంద మూర్తిగారి దగ్గరికి వెళ్లి నా పిహెచ్. డి అంశాన్ని చెప్పి మీరే పర్యవేక్షులుగా ఉండాలని కోరాను.
‘మీరు రామారావు గారిచ్చి న టాపిక్ మీద, నా దగ్గర పరిశోధన చేయాలనుకుంటున్నారు. నాకేమీ ఇబ్బం ది లేదు.’ అని తమ సమ్మతిని తెలియజేశారు. ఆచార్య రామారావుగారంటే అంద రికీ గౌరవమే. సాధారణంగా విశ్వవిద్యాలయ ఆచార్యలు తమ పర్యవేక్షణలో పరి శోధన చేయాలని వచ్చిన విద్యార్థులకు తామే పరిశోధనాంశాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ మరొక విధంగా జరిగింది. ఆచార్య రామారావుగారిచ్చిన అంశాన్ని నేను తీసుకున్నప్పటికీ, దాన్ని ఆనంద మూర్తి గారా మోదించడం ఆనందాన్ని కల్గించింది.
ఆచార్య రామారావు గారిచ్చిన అంశం మీ ద ఐదు సంవత్సరాలు కష్టపడి పరిశోధనను పూర్తిచేశాను. నాకు ప్రాచీన తెలుగు కావ్యాలను సమగ్రంగా మరొకసారి చదివే అవకాశం లభించింది. ఏయే కావ్యాల్లో మ న కవులు గ్రామీణ జీవితాన్ని వర్ణించారో తెలుసుకున్నప్పుడు పల్లెలతో పరిచయంలేని ప్రాచీన కవి లేడనిపించింది.
వ్యాసకర్త సెల్: 9885654381