calender_icon.png 17 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పాంచ్ అన్యాయ్’.. గెలుపెవరిది?

16-08-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

భారత ఎన్నికల సంఘం.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహణ అధికారాలను పర్యవేక్షిస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా కల్పించిన అధికారాల కిందే ఈసీ పనిచేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ దాఖలు, ఓటింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరముంది. అయితే రాజకీయ పార్టీలు వారికీ అనుగుణంగా చట్టాలను రూపొందించుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదు లు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి అక్రమాలకు అడ్డులేకుండా ఉండేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి లేని ప్యానెల్ ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించడా నికి 2023 చట్టం తెచ్చింది. ఈ చట్టం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు విరుద్ధంగా ఉందనడంలో ఎలాం టి సందేహం లేదు.

భారతదేశంలో స్వేఛ్చ గా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారం కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్.. బీజేపీ జేబు సంస్థగా మారిందనే ఆరోపణలు విపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ గా ‘అరుణ్ గోయెల్’ రాజీనామా కూడా ఈ తప్పిదాలు ప్రోత్సహించలేక చేసారేమోన న్న అనుమానం కలుగుతుంది. తుపాకీ కంటే శక్తివంతమైన బ్యాలెట్ నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పుచే తుల్లో కీలుబొమ్మగా మారిందనే విమర్శ ఉంది.  

65 లక్షల ఓట్లు ఏమయ్యాయి?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం ఆశ్చర్య కలిగించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకురావడంతో అనుమానం మొదలైంది. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఎత్తి చూపా రు.

‘ఇది భయంకర్ చోరి’గా ఆయన అభివర్ణించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుఖాయమనుకున్న తరుణంలో ఓటమి పిడుగు పడటం కాంగ్రెస్‌ను కుదిపేసింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఓటింగ్ నమోదు పెరగడంతో  అనుమానం రాకమానదు. రాహుల్ తన రహస్య విచారణలో పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దొంగ ఓట్లతో అధికారమార్పిడికి ఒడిగట్టారని, అందుకు ఎన్నికల కమిషన్ పూర్తిగా సహకరిస్తుందని గణాంకాలతో సహా బయటపెట్టారు.

రాహుల్ ఆధారాలను నమ్మిన సుప్రీంకోర్టు బీహార్ లో తీసేసిన 65 లక్షల ఓట్లు బహిర్గతం చేయాలనీ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించడం రాహుల్ గెలుపుగా భావించొచ్చు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ రాష్ర్టంలో 7.89 కోట్ల ఓటర్లు వినియోగించుకున్నారు, అయితే ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన బీహార్ ఓటరు జాబితా సంఖ్య 7.24కోట్లుగా ఈసీ ప్రకటించింది. ఎలాంటి లిఖిత పూర్వక విత్ డ్రా లేకుండా ఓట్లను తొలగించకూడదని ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉంది. మరి ఏడాది వ్యవధిలో 65 లక్షల ఓట్లు ఎలా తగ్గాయనేది కోట్ల మంది ప్రజల్లో నానుతున్న ప్రశ్న.

కర్ణాటక, మహారాష్ర్ట, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల దొంగలపై ఆధారాలతో విపక్ష నేత రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలను బహిర్గతం చేసి ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభు త్వంపై ఒత్తిడి పెంచారు. ‘పాంచ్ అన్యాయ్’పై ఎన్నికల కమిషన్ జవాబును బట్టి కేంద్ర ప్రభుత్వం మనుగడ కొనసాగుతుం ది. ‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ నినాదం తెచ్చిన బీజేపీపై విశ్వాసం పోయి, ఇండియా కూటమి బిగిస్తున్న ‘ఓట్ల చోరి’ ఉచ్చు ప్రతి ఓటరును ఆలోచించేలా చేస్తుంది. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న మాదిరిగా స్వ ల్ప మెజార్టీతో బయటపడి అధికారం దక్కించుకున్న బీజేపీ.. రానున్న జమిలి ఎన్నికల్లో కొట్టుకుపోవడం మాత్రం ఖాయం. 

ఓట్ల దుర్వినియోగం

అధికారం కోసం ‘పాంచ్ అన్యాయ్’ పేరిట రిగ్గింగ్, డూప్లికెటింగ్, నకిలీ అడ్రస్ లు, నకిలీ ఫొటోలు, ఒకే రూమ్ బోలెడు ఓట్లు, పారం-6 దుర్వినియోగం లాంటి పద్దతులకు సహకరిస్తుందనే భావం ప్రజ ల్లో నాటుకుంది. దొంగ ఓట్లను నియంత్రించడం కోసం ఆధార్ కార్డు లింక్ తప్ప నిసరి చేయాలి. రాజ్యాంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతుల్లో ఉన్నంత కాలం భారతదేశంలో ప్రజాస్వామ్యనికి అర్ధం ఉండదు.

ప్రభుత్వ ప్రతినిధులు.. భారత ఎలక్షన్ ప్రధాన కమిషనర్, కమిషనర్లుగా నియమించినంత కాలం తప్పిదాల కు అడ్డుకట్ట వేయలేమని రాజకీయ పండితు లు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని అవాంతరాల మధ్య ఎన్నికల కమిషన్ ఈ విష వలయాన్ని ఛేదించే పరిష్కారాల మీద దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ లేవనెత్తిన ఆధారాలపై భారత ఎన్నికల కమిషన్ సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరముంది. ఇండియా కూటమి ఆరోపిస్తున్న పలు అనుమానాలను నివృత్తి చేసి, ఎన్నికల కమిషన్ తన పారదర్శకతను నిరూపించాలి. నోటీసుల పేరుతో,అరెస్టుల పేరుతో బెదిరింపులకు దిగడం మానేసి.. సుప్రీం కోర్టు అడిగిన విధంగా 65 లక్షల ఓటర్ల తొలగింపుకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరముంది.

2014 నుంచే ఈసీపై అనుమానాలు

2014 నుంచే ఈసీపై అనుమానాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి కాంగ్రెస్ చర్చకు ఆస్కారం ఇవ్వలేదనే అభిప్రాయం నెలకొంది. గెలవాల్సిన అభ్య ర్థులు ఓటమిపాలై బూత్‌ల వారీగా లెక్క లు తీసి సీసీ ఫుటేజీకి అప్పీల్ చేస్తే రాజకీయ పార్టీలకు, సామాజిక కార్యకర్తలకు ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టడం దేనికి సంకేతమో చెప్పాల్సిన అవసరముంది. 1961 ఎన్నికల చట్టాన్ని సవరించి ఆంక్షలు పెట్టడం ప్రత్యర్థుల ఆరోపణలకు ఆజ్యం పోసినట్టయింది.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలైన ఓట్ల కంటే 12.54 శాతం ఓట్లు అధికంగా లెక్కబెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముఖంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం 10 రోజుల తర్వాత నాశనం చేయాలని సీఈఓ మీనా ప్రకటించడం అనుమానాలు రేకెత్తించింది. అయి తే సెక్షన్ 81 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 45 రోజుల వరకు సమాచారం భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎన్ని కల కమిషన్ పై ఉంది.

ఈవీఎంలను టాంపరింగ్ చేశారని అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా.. విపక్షంలో ఉన్న ప్పుడు మరో మాదిరి అనేలా పార్టీల వైఖరి ఉంది. బీజేపీ జాతీయ అధికార ప్ర తినిధి జివిఎల్ నర్సింహారావు ఈవీఎంలు టాంపరింగ్ చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ‘డెమోక్రసి ఎట్ రిస్క్’ అనే పుస్తకం రాస్తే, బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీ దానికి ముందు మాట రాయడం గమనార్హం. అయితే అదే బీజేపీ ఇప్పుడు విపక్షాల వాదనలను నిర్మొహమాటంగా తోసిపుచ్చుతుంది.

2019లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత ఈవీఎంల వల్లనే తాను ఓడిపోయానని ప్రకటించుకున్నారు. మరి అదే జగన్ 2024లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల ను తప్పుపడితే చంద్రబాబు మాత్రం సమర్ధించారు. ఈవీఎంలను టాంపర్ చేయొ చ్చని చెప్పుకున్నా.. ఆధారాలు చూపలేకపోయారు. భారత రాజ్యాంగంలోని మౌ ళిక స్వరూపంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఒక మూలం.

అందుకే ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఆయా పార్టీల సానుభూతిపరులను నియమించడం వల్ల ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శ ఉంది. ఓడిన అభ్యర్థులు అక్రమాలపై కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం వచ్చేసరికి పదవీ కాలం పూర్తవుతుందనే భరోసా అన్ని పార్టీల్లో బలంగా నాటుకుపోవడం బాధాకరం.

వ్యాసకర్త సెల్-: 9866255355