calender_icon.png 21 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిగ్గింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

21-12-2025 12:10:01 AM

బీసీలు తిరగబడి జనరల్ స్థానాల్లో పోటీ చేసి 50% పైగా సీట్లు గెలుచుకున్నారు

42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మం డలం షేరి గూడెంలో మూడో విడతలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేసి, రిగ్గింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం అడు గడుగున అన్యాయం చేసిందని, ఒక వైపు రిజర్వేషన్లు తగ్గించడం, మరొక వైవు ఎన్నికల్లో ఓట్లు రిగ్గింగ్ చేసి అక్రమాలకు పాల్ప డిందని ఆరోపించారు.

ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వ ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను అమలు చేసిన తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిం చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా బీసీలను మోసం చేస్తూ జనరల్ స్థా నాల్లో నిలబడ్డ బీసీ అభ్యర్థులను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

అయినప్పటికీ బీసీలు రిజర్వ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాలు కలిపి 5123 స్థానా లు కైవసం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డికి బీసీలు చెంపదెబ్బ కొట్టారన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అయినప్పటికీ బీసీలు తిరగబడి జనరల్ స్థానాల్లో పోటీ చేసి 50 శాతా నికి పైగా సీట్లు గెలుచుకున్నారని తెలిపారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అన్ని విధా ల కృషి చేయాలని, లేని పక్షంలో జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం భారీ రోడ్ల నిర్మాణం పేరుతో వేలాది కోట్ల పచ్చని పొలాలను చెరబడుతుందని అన్నారు. నగ రం నలువైపులా రేడియల్ రోడ్లు, రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్ హైవేల నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు పేద రైతులపై దౌర్జన్యం చేస్తూ భూములను గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు.

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టిన రావిలాల, కోకాపేట్ గ్రీన్ ఫీల్ హైవేలతో వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేష్ ముదిరాజ్, సి.రాజేందర్, టి. రాజ్ కుమార్, నిఖిల్, పృద్వి, మైలారం గంగాభవాని, శ్రీనివాస్, సత్యనారాయణ, చిక్కుడు బాలయ్య  తదితరులు పాల్గొన్నారు.