27-10-2025 12:28:02 AM
దరఖాస్తుల ద్వారా రూ.259.02 కోట్ల ఆదాయం
నేడు జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు
సంగారెడ్డి/ సిద్దిపేట/ మెదక్, అక్టోబర్ 26 (విజయక్రాంతి):ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత పారదర్శకంగా మద్యం లాటరీ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆ యా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. 2025 - 27 సంవత్సరాలకు ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ ఈనెల 23న ముగిసింది.
ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు గాను 1,420 దరఖాస్తులు, సంగారెడ్డి జిల్లాలో 101 దుకాణాలకు గాను 4,432 దరఖాస్తులు, సిద్దిపేట జిల్లాలో 93 వైన్ దు కాణాలకు గాను 2,782 దరఖాస్తులు రాగా మొత్తం 243 దుకాణాలకు గాను 8,634 దరఖాస్తు లు వచ్చినట్లు ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.
దరఖాస్తుల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.259.02 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గత 2023-25లో మొత్తం 12,227 దరఖాస్తులు రాగా, అప్పట్లో ఫీజు రూ.2 లక్షలే ఉండడంతో ప్రభుత్వానికి రూ.244.54 కోట్ల ఆదాయం వ చ్చింది. ఈసారి ఫీజు పెంపుతో దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం అదనంగా రూ.14.48 కోట్లు వచ్చింది.
నేడు మద్యం దుకాణాలకు డ్రా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 243 మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఆయా జిల్లాలలో కలెక్టర్ల సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగు తుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు లేదా ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వారు దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చిన రసీదు, ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.