07-05-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ, మే 6 : ఎన్నికల ప్రచారంలో ప్రైవేటు పాఠశాలలు ప్రచారం నిర్వహిస్తున్నారని బిఆర్‌ఎస్వి దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో మాట్లాడుతూ ప్రవేట్ పాఠ శాలలు విచ్చలవిడిగా ప్రచారం నిర్వహిస్తున్న నిమ్మకు నీరేత్తినట్లు విద్యా శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరు ద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రైవే టు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లేనిచో బిఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హేచ్చరించారు.