24-08-2025 01:23:31 AM
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రంలో చైతన్యరావు కీలక పాత్ర పోషించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుల కానుంది. ఈ నేపథ్యంలో నటుడు చైతన్యరావు విలేకరులతోసినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-నిర్మాత రాజీవ్ డైరెక్టర్ క్రిష్‌ను కలవమన్నారు. క్రిష్ కథ, నా క్యారెక్టర్ గురించి చెప్పారు. అసలా పాత్రలో నన్నెలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. చాలా సీరియస్, వైలెంట్ రోల్. లుక్ కోసం రెండు రోజులపాటు రకరకా లుగా ట్రై చేశాం. ఫైనల్‌గా ఈ లుక్ ఓకే చేశాం.
-నేను ప్రతినాయకుడిగా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే, -ఇది రెగ్యులర్ విలన్‌లాగా ఉండదు. డైరెక్టర్ నన్ను విలన్‌లా కాకుండా మెయిన్ క్యారెక్టర్‌లాగే చూశారు. నా రోల్ చాలా కీలకంగా ఉంటుంది. నా కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది.
-క్రిష్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందులో నాకొక మేనరిజం ఉంటుంది. ఒక యాక్టర్‌గా కొన్ని ఆలోచనలు చెప్పాను. క్రిష్ కూడా చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది.
-ఈ సినిమాను ఈస్ట్రన్ ఘాట్స్‌లో షూట్ చేశాం. అక్కడ షూటింగ్ చాలెంజింగ్. చాలా రిస్కీగా జలపాతం సీన్ చేశాం. ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. అనుష్క చాలా రిస్క్‌తో ఆ సీక్వెన్స్ చేశారు. అది చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారు.
-క్రిష్‌తో వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకు ఈ సినిమాతో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్‌కు నేను పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతానని ఆయన బలంగా నమ్మారు. నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నా.
-ఈ రోజుల్లో విలన్, హీరో అన్ని రోల్స్‌నూ ఆడియన్స్ సమానంగా ఆదరిస్తున్నారు. యాక్టర్‌గా అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. సత్యదేవ్, ఫహాద్ ఫాజిల్ అన్నిరకాల పాత్రలు చేస్తున్నారు. నేను కూడా ఆ స్పేస్‌లోనే చూస్తున్నాను.
-అనుష్కతో కలిసి పనిచేయడం అంటే.. మొదట నమ్మబుద్ధి కాలేదు. నేను ఆమెకు చాలా పెద్ద ఫ్యాన్. బిగ్ లేడీ సూపర్ స్టార్. వెరీ స్వీట్ పర్సన్. ఆమెను జీవితంలో ఒక్కసారైనా చూస్తే చాలనుకున్నా. అలాంటిది కలిసి నటించడమనేది మర్చిపోలేని అనుభవం.
-‘-మయసభ’కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఘాటి’ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. ఈ రెండూ నా కెరీర్‌లో బిగ్గెస్ట్ పిల్లర్స్‌లాంటి ప్రాజెక్ట్స్. డైరెక్టర్ క్రిష్, దేవా కట్ట.. ఇద్దరూ ఒకటే మాట చెప్పారు.. ఈ రెండు ప్రాజెక్టులూ బయటకు వచ్చేంతవరకు కొత్త సినిమాల గురించి ఆలోచించొద్దన్నారు. ఈ సినిమాల తర్వాత కచ్చితంగా నా కెరీర్ మరో మలుపు తిరుగుతుందని చెప్పారు. వాళ్లు చెప్పింది నిజమవుతుంది. -ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో ఒక సినిమా చేస్తున్నా. ఇంకొన్ని కథలూ సిద్ధంగా ఉన్నాయి. వాటిని త్వరలోనే ప్రకటిస్తారు.