24-08-2025 01:21:43 AM
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేశ్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానున్న క్రమంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన సినిమా సంగతులివి..
-నేను సంగీతం నేర్చుకున్నా. ఎన్నో ఈవెంట్లలో పాటలు పాడేవాడ్ని. సినిమా దర్శకుడు కావాలన్నదే నా కల. కథల్ని బాగా చెప్పగలను. కథ చెప్పగానే నిర్మాతకు నచ్చింది.
- డైరెక్టర్ మారుతి నా నెరేషన్‌తోనే నన్ను నమ్మేశా రు. అయి తే, మారుతి జానర్ సినిమా కాది ది. ‘మహారాజా’ స్క్రీ న్‌ప్లే, టెంప్లెట్‌లో ఈ మూవీ ఉంటుంది. ఆ మూవీ తర్వాత మారుతి మా ‘బార్బరిక్’నే నమ్మారు.
-బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం కొనసాగేలా చేస్తాడు. ఉత్తరాదిన బార్బరికుడికి ఫాలోయింగ్ ఎక్కువ. సత్యరాజ్ కొన్నిచోట్ల బార్బరికుడిలానే కనిపిస్తారు. మేకప్ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను.
-ఈ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. ప్రతి పాత్రకూ భిన్న పార్శ్వాలుంటాయి. సినిమాలో హీరో, విలన్.. అని ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది.
-ఈ సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నా. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకునేవాడు గొప్ప మనిషి అని ఈ సినిమాతో చెప్పదలుచుకుంటున్నా.