calender_icon.png 9 May, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

07-05-2025 12:00:00 AM

గూడూరు, మే 6 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్య పురం పొనుగోడు గూడూరు బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు మంగళవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు పొనుగోడు పాఠశాలలో ఎంఈఓ రవికుమార్ శిబిరాలను ప్రారంభించగా అయోధ్య పురంలో శిబిరాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కోటేశ్వరరావు మరియు ఎంఈఓ రవికుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్త్స్ర కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శిబిరాలలో చెప్పే విషయాలను అర్థం చేసుకొని మరింత ప్రగతి పొందాలని అన్నారు. విద్యార్థులు చెడు  వ్యసనాలకు దూరంగా ఉండాలని మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సదాశివ సురేష్ షాహిది అలీ వెంకటయ్య చంద్రమౌళి పూల్ సింగ్ పవన్ ఫిజికల్ డైరెక్టర్లు బిక్షపతి పుష్పనీలలు గ్రామస్తులు మాదాసు రమేష్ తదితరులు పాల్గొనగా ఈ శిబిరాలు ప్రతి ఉదయం 8 గంటల నుండి పదిన్నర వరకు కొనసాగుతాయని విద్యార్థులు తప్పక హాజరుకావాలని సూచించారు.