calender_icon.png 2 July, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలపై చర్యలు తీసుకోవాలి

01-07-2025 08:04:14 PM

మంథని సీఐ రాజుకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం...

మంథని (విజయక్రాంతి): పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం మంథని సీఐ రాజు(CI Raju)కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మంథని పట్టణంలో విచ్చలవిడిగా ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ లాంటి వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను రవాణా చేయడం జరుగుతుందని, ఒక్కోక్క ఆటోలో, టాటా మ్యాజిక్ వాహనాల్లో మోతాదుకు మించి అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించుకొని రవాణా చేయడం జరుగుతుందని, వాహనాల నిర్వహణ బాధ్యత యాజమాన్యాలదే అయినప్పటికీని వాహనాల ఫిటనెస్ విషయంలో మాత్రం అజాగ్రత్త వహిస్తున్నారని, ఫిట్ నెస్ లేని వాహనాలను ఉపయోగించి అధిక సంఖ్యలో విద్యార్థులను రవాణా చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై వెంటనే  రవాణా శాఖ, విజిలెన్స్ సంబంధిత అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలన్నారు‌. ఈ విషయంపై మంథని సీఐ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ పాల్గొన్నారు.