01-07-2025 08:07:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శివారు కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీ రామ్ నగర్ కాలనీలోని రెండు మూడు నంబర్ వీధుల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. కాలనీలో సిసి రోడ్లు లేవని విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్న పట్టించుకోవడం లేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించడం జరిగిందని వారు తెలిపారు. వర్షాకాలం కావడంతో రోడ్లు లేక మురికి కాలువలో వెళ్లవలసిన దోమలు ఈగల బెడుద ఎక్కువగావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.