21-08-2025 12:00:00 AM
వరద నీరు నిలిచిన శ్రీరాంనగర్‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ కర్ణన్
ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు నిలిచిన బాగ్లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సందర్శించి పరిశీలించారు. వర్షపు నీటితో పాటు, మురుగు నీరు ముం చెత్తడానికి గల కారణాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.
హుస్సేన్సా గర్ ఔట్లెట్ నాలాను కలుపుతూ 30 ఏళ్ల క్రితం నిర్మించిన పైపులైన్ బ్లాక్ అవ్వడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు హైడ్రా కమిషనర్ కు తెలిపారు. ఇక్కడి ఖాళీ ప్లాట్లో బోర్ వేసినప్పుడు పైపులైన్ దెబ్బతిన్నదని చెప్పారు.
వెంటనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ లోగా మోటార్లు పెట్టి నీటిని మొత్తం ఖాళీ చేయాలని సూచించా రు. సమస్యను తెలుసుకుని వెంటనే ఇక్కడకు వచ్చి పరిశీలించిన కమిషనర్కు స్థాని కులు కృతజ్ఞతలు తెలిపారు.