calender_icon.png 21 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు న్యాయం చేయాలి

21-08-2025 12:00:00 AM

సీఎం రేవంత్‌రెడ్డికి గంగా జెమినీ వెల్ఫేర్ సోసైటీ బాధితులు విజ్ఞప్తి

ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి):  చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ళ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకోకుండా అడ్డు పడుతున్న వ్యక్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని నిరుపేదలకు న్యా యం చేయాలని గంగా జెమిని వెల్ఫేర్ సోసై టీ బాధితులు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోసైటి ప్రధాన కార్యదర్శి మహ్మద్ హబీబ్ ఉద్దీన్, సభ్యులు మహ్మద్ నవాజుద్దీన్, మహ్మద్ ఇర్షాద్, షేక్ మోహిజ్, మహమ్మద్ నసీర్, మహమ్మద్ ఎజాస్ తదితరులు మాట్లాడారు. శంషాబాద్ మండలంలోని నర్కోడ గ్రామంలోని సర్వే నెం.347/419 లోగల భూమని స్థానికుడైన పెంటయ్య వద్ద రఫీఖ్ కొనుగోలు చేశారని తెలిపారు. కాగా ఆ భూమిలో రఫీఖ్ 150 ప్లాట్స్‌తో ఒక వెంచర్ వేయడం జరిగిందన్నారు.

ఈ వెంచర్ లో 100 మందికి పైగా పేదలు ఆ150 ప్లాట్స్‌ను ఎంతో కష్టపడి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ ప్లాట్స్‌లో కొంత మంది ఇళ్ళు నిర్మించుకున్నారని, మరికొంత మంది ఇళ్ళు నిర్మించుకోలేదన్నారు. ఈ మధ్య కాలంలో అక్కడ స్థలాల ధరలు పెరగడంతో మిగిలిన వారిని ఇళ్ళు నిర్మించుకోనీయకుండా పెంటయ్య, అతని సోదరులు అడ్డుప డుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీసు లు, డిఎస్పీపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.