calender_icon.png 10 October, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

10-10-2025 12:31:30 AM

--బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ 

-- బోయినపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన ప ల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఎం హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలు, వార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మ సీ తదితర అంశాలపై ఆరా తీశారు.

ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ హరిత మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.