08-11-2025 07:04:12 PM
వినియోగధారులు తస్మాత్ జాగ్రత్త
సమాచారం ఇస్తే కేసులు చేస్తాం: సీ.ఐ సత్యనారాయణ
భీంగల్,(విజయక్రాంతి): అమాయక వినియోగదారులకు అరచేతిలో వైకంఠం చూపిస్తామని అబద్దాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చెయ్యాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. భీంగల్ సర్కిల్ పరిధిలో రియల్టార్లు, వాహన షో రూమ్ వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగధారులను మోసం చేసేందుకు లక్కీ, బంపర్ డ్రా లు నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు భీంగల్ ఎస్సై సందీప్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీ.ఐ మాట్లాడుతూ తమ అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుకోవడానికి ఈ డ్రా ల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భీంగల్ సర్కిల్ పరిధిలోని మోర్తాడ్, కమ్మర్ పల్లిలో ఇలాంటి డ్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కడైన, ఎవ్వరైన ఇలాంటి లక్కీ, బంపర్ డ్రాలు నిర్వహించిన తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.డ్రా నిర్వాహకుల మాయమాటలకు మోసపోవద్దని అన్నారు. ఈ లక్కి డ్రాల నిర్వహణ చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి డ్రాల నిర్వాహకులు ప్రజల వద్ద తమ టార్గెట్ డబ్బులను గుంజి పారిపోవడం, ఐ. పీ పెట్టడం చేస్తారని సీ. ఐ తెలిపారు. అందుకే ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.