calender_icon.png 8 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలి..

08-11-2025 07:05:56 PM

తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పుర్క బాపురావు..

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలిగించాలనే ప్రధాన డిమాండ్ తో ఆదివాసులు పోరాడుతున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పుర్క బాపురావు అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద ధర్మ యుద్ధ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23న ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో గ్రౌండ్ లో ఆదివాసీల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే నినాదంతో 30 సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తున్నామన్నారు. కావున ఉట్నూర్ లో జరిగే ధర్మ యుద్ధ సభకు రాష్ట్ర నలుమూలల నుండి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో గొండ్వాన వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆడ హనుమంతు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెందూర్ ప్రభాకర్,మండల అధ్యక్షుడు పుర్క చిత్రు, గౌరవ అధ్యక్షుడు జుగ్నక్ భారత్,జిల్లా ఉపాధ్యక్షుడు భారత్, సోయం మురారి, దుర్వా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.