calender_icon.png 2 December, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్

02-12-2025 02:17:43 AM

రామాయంపేట, డిసెంబర్ 1 :రామాయంపేట, నార్సింగి, నిజాంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు.

దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.