calender_icon.png 2 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్ బాక్స్‌ల భద్రతపై అవగాహన

02-12-2025 02:17:53 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, డిసెంబరు 1, (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ ల వినియోగం సమస్యలతో భద్రతపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్, సాధారణ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డితో కలిసి నోడల్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 గ్రామ పంచాయితీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పోలింగ్ లో వినియోగించే బ్యాలెట్ బాక్సుల పంపిణీ, భద్రత, నిల్వ, రవాణా, సీలింగ్ వంటి అన్ని అంశాల పై గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను  సక్రమంగా నిర్వహిస్తు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు  తావివ్వకుండ పారదర్శకంగా  సజావుగా నిర్వహించాలని   ఎన్నికల సాదారణ  పరిశీలకులు అన్నారు.

సోమవారం  జిల్లా కలెక్టర్ క్యాంప్  కార్యాలయంలో సమావేశ నిర్వహించారు.  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  తీసుకున్న చర్యలు, ఎన్నికల పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలు, రెండవ విడత నామినేషన్ ప్రక్రియ రేపటి తో ముగియనున్నందున చేపడుతున్న చర్యలు పై నోడల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

అధికారులు, టెక్నికల్ టీములు, రవాణా విభాగం, ఎన్నికల శాఖ సిబ్బందికి తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నియమ. నిబంధనలు పాటించాలని ఆన్నారు. బ్యాలెట్ బాక్స్ల సంఖ్యఅందుబాటునాణ్యత తనిఖీ, ప్రతి మండలానికి అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను లెక్కించి జాబితా ఖరారు చేయాలి. పాడైపోయిన, వినియోగయోగ్యం కాని బాక్స్ లను వెంటనే మార్చాలి. బాక్స్ ల లాక్లు, స్లాట్లు, సీల్ పాయింట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా నిర్ధారించాలి. 

భద్రత , నిల్వ 

బ్యాలెట్ బాక్స్లు డిపాజిట్ కేంద్రాలలో 24స7 భద్రతతో భద్రపరచాలి. సీసీ కెమెరా పోలీసు పహారా తప్పనిసరి. ఏ విధమైన అనధికార ప్రవేశం ఉండకూడదు. రవాణా సన్నాహాలు పోలింగ్ రోజు బాక్స్లను సురక్షితంగా పోలింగ్ స్టేషన్లకు తరలించడానికి ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలి, రవాణా వాహనాలకు GPS, సెక్యూరిటీ సిబ్బంది, సీల్ వాహనాల వినియోగం పరిశీలించాలి.  పోలింగ్ అనంతరం బాక్సుల రిసీవ్ ,స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు పోలింగ్ ముగిసిన తర్వాత డిసైడింగ్ అధికారులు  బాక్సులను స్వీకరించే కౌంటర్లు సిద్ధం చేయాలి, పార్టీ ఏజెంట్లు సమక్షంలో సీలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

శిక్షణ , అవగాహన

POలు, APOలు, పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్ వినియోగం, సీలింగ్, ప్యాకింగ్ విధానం పై ఇస్తున్న ప్రత్యేక శిక్షణ లో ఆన్ని అంశాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

పోలింగ్ స్టేషన్ స్థాయి అధికారులందరూ బ్యాలెట్ పేపర్లు, బాక్స్ హ్యాండ్లింగ్లో ఏ తప్పిదం జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సీఈఓ చందర్, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.