calender_icon.png 4 November, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మద్యం దుకాణాల లక్కీ డ్రా

04-11-2025 12:39:53 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ ౩ (విజయక్రాం తి): జిల్లాలో 32 మద్యం దుకాణాలకు గతంలో ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా 7 దుకా ణాలకు నిర్దేశించిన దరఖాస్తుల కంటే తక్కువగా రావ డంతో రాష్ట్ర ప్రభుత్వ  ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతి కిరణ్ రీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో భాగంగా శనివారం వరకు దరఖా స్తులు స్వీకరించిన అధికారులు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో దరఖాస్తుదారుల ఎదుట లక్కీ డ్రా నిర్వహించారు.

7 దుకాణాలకు 90 మంది దరఖాస్తు చేసు కోగా కలెక్టర్ ఏడుగురు అదృష్టవంతులను ఎంపిక చేశారు. లక్కీ డ్రా లో భాగంగా రెబ్బెన షాప్ నెంబర్ 9 ని పాలె మహేష్ దక్కించుకోగా, గోలేటి షాప్ నెంబర్ 10ని శివమణికి దక్కగా, కాగజ్ నగర్ సర్ సిల్క్ ఏరియా షాపు 14 విజేతగా ఇంద్రనాథ్, కౌటాల మండలం రవీంద్ర నగర్ షాపు 13 రామగొని శ్రీనివాస్ గౌడ్, జైనూర్ 1 షాపు జాదవ్ శ్రీనాథ్, జైనూర్ 2 షాపు సుర్పం యశ్వంత్ రావు, సిర్పూర్ యు దుకాణాన్ని లక్కీ డ్రా లో మాత్రం నాగోరావు దక్కించుకున్నాడు.