12-08-2025 12:00:00 AM
-అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
-పెండింగులో ఉన్న పంచాయతి భవనాల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తా
-బిక్కుతండా జీపీ నూతన కార్యాలయ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 11 (విజయ క్రాంతి): నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయాలతో పాలన సేవలు సులభతరం అవుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బిక్కుతండా గ్రామాల్లో రూ 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనం ను ఎమ్మెల్యే అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే లక్షంగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
ఇజిఎస్, డిఎమ్‌ఎఫ్టి, ఎస్డిఎఫ్ తదితర నిధులతో కోట్లాది రూపాయల వ్యంతో రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని, ప్రతిపాదనలు పంపిన అభివృద్ధి పనులను త్వరలో అనుమతులు లభిస్తాయని తెలిపారు. అభివృద్ధిలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకున్నామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా పెండింగులో ఉన్న పంచాయతి భవనాల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రజల మౌలిక వసతుల కల్పనపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించాలినీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏడీఈ అబ్దుల్ రహీం, పంచాయతీరాజ్ డి ఈ రామకృష్ణ, ఎంపీఓ, రూరల్ ఎస్‌ఐ సురేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, అధికారులు పాల్గొన్నారు.