calender_icon.png 12 August, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాలి

11-08-2025 01:30:42 AM

- స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలి 

- పార్టీ నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ దిశా నిర్దేశం 

- వరంగల్ నేతలు ఐక్యంగా ముందుకు వెళ్లాలి 

- కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ సూచన 

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆయా జిల్లాల్లో వివాదాలు, గ్రూపు లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నాయకులకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఈ మేరకు వివిధ  జిల్లాలో నేతల మధ్య నెలకొ న్న వివాదాలు, సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి కాంగ్రెస్  క్రమశిక్షణ కమిటీ ఆదివారం స మావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా పలువురు నేతలు కమిటీ ముందు హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ప నిచేయాలని వారికి కమిటీ సూచించింది. నా యకుల మధ్య నెలకొన్న పంచాయితీలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తద్వా రా పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నది. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను ఒక్కొక్కటికి పరిష్కరి స్తామని నిర్ణయించింది. 

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి 

 వరంగల్  జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు రెండు గ్రూప్‌లుగా విడి పోయి ఒకరిపై ఒకరు పీసీసీ క్రమశిక్షణ సం ఘానికి ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లా నేతలతో పలుమార్లు సమావేశమైన   కమిటీ నాయకుల మధ్య నెలకొన్న పంచాతీకి గల కారణాలపై చర్చించింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో ఆది వారం  పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మ ల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత కొండా మురళి హాజరయ్యారు.

వరంగల్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరును మరోసారి  కమిటీ ముందు ఆయన ఏకరవు పెట్టినట్లు తెలిసింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమను కావాలనే ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, అయినా కొంత వరకు ఓపిక, సహ నంతో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం పని చేస్తానని, పార్టీ సూచనలను తప్పకుండా పాటి స్తానని  సమావేశంలో చెప్పినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.

రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు రాలేదు: మల్లు రవి 

 సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విషయం కూడా చర్చించినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. భవిష్యత్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతం, ఇతర సమస్యలన్నింటిపైన కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. పార్టీ నాయకులందరూ కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల చేసిన విమర్శలపై చర్చించారా అని మీడియా ప్రశ్నించగా రాజగోపాల్‌రెడ్డి అంశం చర్చకు రాలేదన్నా రు. రాజగోపాల్‌రెడ్డి విషయంపై  పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తమ దృష్టికి రానందునే చర్చించలేదని స మాధానమిచ్చారు. 

వివరణ ఇచ్చాను సంతృప్తి చెందారు : కొండా మురళి

మా రక్తంలోనే  కాంగ్రెస్ పార్టీ ఉందని, పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా తూచా తప్పకుండా పాటిస్తానని మాజీ ఎమ్మెల్సీ,   సీనియర్ నేత కొండా మురళి అన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. జిల్లాలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న సమస్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చానని, కమిటీ కూడా సంతృప్తి చెంది నట్లు ఆయన తెలిపారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని, అందుకు కలిసి పనిచేయాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారని మురళి పేర్కొన్నారు. పార్టీ నేతగా తరచూ గాంధీభవన్‌కు వస్తానని తెలిపారు.