calender_icon.png 27 August, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాన్లకు అధునాతన ఆయుధాలు

02-07-2024 05:59:25 AM

  • ఆర్మీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది 
  • ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర

న్యూఢిల్లీ, జూలై 1: ఇండియన్ ఆర్మీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, దూకుడును కొనసాగించడం చాలా ముఖ్యమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉద్ఘాటించారు. ఆదివారం భారత ఆర్మీ 30వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సైనికులకు అధునాతన సాంకేతిక తతో కూడిన ఆయుధాలను అందించడం చాలా ముఖ్యమని ద్వివేది పేర్కొన్నారు. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కూడా ప్రధానమన్నారు.

ప్రస్తుతం ఆర్మీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, సవాళ్లను, బెదిరింపులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ భౌగోళిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, సాంకేతిక త కూడా కొత్త పుంతలు తొక్కుతోందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పక్కలో బళ్లెంలా చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న వేళలో ద్వివేది నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.  

అదే నా లక్ష్యం

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మధ్య బలమైన బంధం ఏర్పరచడమే తన లక్ష్యమని.. ఇది జాతీయ ప్రయోజనాలను కాపాడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురుకాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని పౌరులకు తాను మాటిచ్చారు. 40 ఏళ్ల అనుభవంలో ద్వివేది ఆర్మీ వైస్ చీఫ్‌గా, ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు ఇంకా అనేక హోదాల్లో సేవలందించారు.