calender_icon.png 27 August, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలు విడుదల

02-07-2024 05:57:38 AM

  • అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు వెల్లడి
  • ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డులు

న్యూఢిల్లీ ,జూలై 1: నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. గ్రేస్ మార్కుల కేటాయింపు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1563 మంది విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. సోమవారం వారి మార్కులతో పాటు ర్యాంకులను ప్రకటించింది. దీంతో పాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు తెలిపింది. ఫలితాలు, సవరించిన ర్యాంకు కార్డులను యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపింది. మొత్తం 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. నీట్‌ణౌ 2024 ఫలితాల్లో ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడం వివాదాస్పదమైంది.