02-07-2024 06:01:19 AM
న్యూ ఢిల్లీ, జూలై 1: పరువు నష్టం దావా కేసులో నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ౫ నెలల సాధారణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు నిచ్చింది. కేవీఐసీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. క్రియాశీల యాక్టివిస్ట్‌గా ఉన్న మేధా పాట్కర్ తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు సక్సేనా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు తీర్పుపై మేధా మాట్లా డుతూ.. ‘మేము ఎవరి పరువుకూ భంగం కలిగించలేదు.. కేవలం మా పని మేం చేశాం, నిజం ఎప్పటికీ ఓడిపోదు’ అన్నారు. కోర్టు తీర్పును మేము సవాల్ చేస్తామన్నారు.
కోర్టు తీర్పు వివరాలు..
సక్సేనాకు సంబంధించి పరువు నష్టం కలిగించే విధంగా మేధా పాట్కర్ వ్యవహరించారని.. అతడు ఒక పిరికివాడు, హవాలా లావాదేవీలతో అతడికి సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారని తెలిపింది. ఈ వ్యాఖ్యలతో సక్సేనా పరువుకు భంగం వాటిల్లిందని కోర్టు వెల్లడించింది.