calender_icon.png 29 May, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి

28-05-2025 12:11:09 AM

హైకోర్టు న్యాయవాది బాల భానుమూర్తి విజ్ఞప్తి 

ఖైరతాబాద్; మే 27 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో న్యాయవాదుల భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ’అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తేవాలని హైకోర్టు న్యాయవాది బాల భానుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు పెరు గుతున్న నేపథ్యంలో ఈ యాక్ట్ తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

సీనియర్ సిటిజన్ల కేసులు సత్వరమే వరిష్కరించే దిశగా న్యాయవ్యవస్థ ఆలోచించాలని అన్నారు. అంతేకాక వారికి ఆర్ధిక సాయం, ఉచిత న్యాయ సహాయం అండేలా చూడాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులలో ఎ లాంటి ఆలస్యం కాకుండా కౌంటర్ వెంటనే వేయాలని, దాంతో వెంటనే న్యా యం జరిగేలా చూడాలన్నారు.

20ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేసిన నా క్లయింట్లపై హత్యాయత్నం చేశారని, కానీ ఇప్పుడు న్యాయవాదిగా తనను దెబ్బతీయాలని లేదా చంపాలని నా క్లయింట్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు న్యాయవాదులుపై దాడులు, హత్య లు ఎందుకు జరుగుతున్నాయో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.

తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్షలు వేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరా రు. న్యాయవాదుల కోసం అవసరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.