calender_icon.png 29 October, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా అమ్ముకున్నాక.. కొనుగోళ్లు ఎందుకు?

29-10-2025 12:24:56 AM

  1. ఆలస్యంగా ప్రభుత్వ కొనుగోళ్లతో నష్టపోయిన రైతులు

మార్క్ఫెడ్ పనితీరుపై సర్వత్ర విమర్శలు

వ్యాపారులకు ప్రయోజనం.. రైతులకు నష్టం

నిర్మల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): చేతు లు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది ప్రభు త్వ తీరు. ఆరు కాలం కష్టపడి పంటలు పండిం చే రైతులకు ప్రభుత్వ తీరు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం ఏదైనా పంట కొనుగోలలో తీవ్ర జాప్యం చేయడం జిల్లా రైతాంగాన్ని ప్రతి ఏటా నష్టానికి గురిచేస్తోంది. పంట చేతికి రాగానే మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం పంట మొత్తం విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం పై రైతులు మండిపడుతున్నారు నిర్మల్ జిల్లాలో మార్క్ఫెడ్ తీరుపై సర్వత్ర విమర్శలు వినవస్తున్నాయి.

వాన కాలంలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న సోయా పంటలు సెప్టెంబర్ మాసంలోని పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో జిల్లాలో పంటలు సాగుచేసిన రైతులు ప్రభుత్వ కొనుగోళ్లపై సంసిద్ధత ఏర్పడ్డ నేపథ్యంలో చేతికొచ్చిన పంటను దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోయారు. నిర్మల్ జిల్లాలోని 79 వ్యవసాయ వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 80 వేల ఎకరాల్లో సోయపంటలు వానాకాలంలో సాగు చేయగా 30 వేల ఎకరాలు మొక్కజొన్నలు సాగుచేసినట్టు వ్యవసా య శాఖ తెలిపింది.

జూన్ మాసంలో విత్తనాలు వేసుకొని వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాగా మద్దతు ధర కోసం ప్రభుత్వ కొనుగోళ్లపై ఆశతో ఎదురుచూసిన రైతాంగానికి అవి సకాలంలో ప్రారంభించకపోవడంతో దళారులను ఆశ్రయించి మద్దతు ధర పొందలేకపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకుం టలకు రూ2400, స్వయపంటకు రూ 53 28 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం సెప్టెంబర్ మాసంలోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకొని మద్దతు ధర పొందే అవకాశం ఉండేది

నెల రోజులుగా ఆలస్యం.. 

నిర్మల్ జిల్లాలో వానాకాలం సీజన్లో పండించిన మొక్కజొన్న స్వయపంట లు రైతులు ఇప్పటికే 60 శాతం పైగా దళారులకు అమ్ముకున్నారు. ఈసారి అధిక వర్షాలు ఆపై వరదలు పంట తెగుళ్లు రైతు పంటల దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపాయి. మొక్కజొన్న వానాకాలం సీజన్లో 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని అది 20 క్వింటాళ్లకి పరిమిత మైందని రైతులు వాపోతున్నారు.

అలాగే సోయపంట ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది నాలుగు క్వింటాలకు మించి రావ డం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. వచ్చిన కొద్దిపాటి పంటను మద్దతు ధరకు విక్రయించుకుందామంటే మార్క్ఫెడ్ కొనుగో లు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో దళారులకు పంటను విక్రయిస్తున్నారు. దళారులు సిండికేట్ గా ఏర్పడి నాణ్యత రంగు మారిన నేపథ్యంలో మొక్కజొన్నకు 18 నుంచి 19 వందల రూపాయల వరకు కొనుగోలు చేశారు.

అయితే  రైతుల వద్ద నుంచి 500 తగ్గించి కొనుగోలు చేయడంతో ఎకరానికి రైతులు 5000 చొప్పున నష్టపోయారు. అలా గే సోయా పంటను గుంటలకు 4200 నుంచి 4400 వరకు కొనుగోలు చేయగా క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున నష్టపోయారు. ఒక్కొక్క ఎకరానికి 4000 చొప్పు న నష్టం జరగడంతో రైతులు పెట్టిన పెట్టుబడిలు రాక ఆర్థిక సంక్షోభంలో పడుతున్నారు.

పంటకు మద్దతు రా కల్పించవలసిన ప్రభు త్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పంట చేతికి రాగా నే కొనుగోలు ప్రారంభించవలసి ఉన్న నెల రోజులుగా ఆలస్యం చేయడం వల్ల వల్ల రైతులకు జరగవలసిన నష్టం జరిగిపోయిందని జిల్లా రైతులు వాపోతున్నారు ముఖ్యంగా చిన్న సన్న సన్న రైతులు కౌలు రైతులు రబీ సీజన్ కు అవసరమయ్యే పెట్టుబడుల కోసం పంట నిలువ చేసుకునే అవకాశం లేక మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాక పంటను దళారులకు లేని పరిస్థితిలో విక్రయించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

సంపన్నులకి ప్రయోజనం

జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్నా మొక్కజొన్న సోయా కొనుగోలు కేంద్రాలపై జిల్లా మార్క్ఫెడ్ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్లో పంట చేతికి రాగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వ కొనుగోలు ఏర్పాటు చేయకపోవడమే రైతులకు నష్టానికి గురిచేస్తోంది.

ప్రభుత్వ కొనుగోలు ఉంటాయో లేదో అన్న బెంగతో జిల్లాలోని రైతాంగం పండిన పంటను  నిలువ చేసే స్తోమత లేక పెట్టుబడి పైసలు లేక దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించుకున్నారు. పంటను వికరించు కొన్న రైతుల్లో 80 శాతం రైతులు చిన్న సన్నకారు రైతులే కావడం గమనారం. అయితే ప్రభుత్వం ఇటీవలి  మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా బుధవారం నుంచి సోయ కొనుగోలను ప్రారంభిస్తున్నట్టు మార్క్ఫెడ్ అధికారులు ప్రకటించారు.

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాల యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఐదు మాత్రమే ప్రారంభం కాగా సోయ కొనుగోలు ఐదు కేంద్రాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.  రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలను దళారులు పంటను నిల్వ చేసుకొని రైతుల పేరుపై సోయ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకుని క్వింటాలకు 1000 రూపాయలు అదనం గా ప్రయోజనం పొందుతున్నారు.

మొక్కజొన్న రైతులు సైతం ఇదే పరిస్థితి. దళారులు మోతుపరి రైతులు పంటను నిలువ ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగానే మద్దతు ధర పొందుతూ విక్రయించుకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వారికి ప్రయోజనం చేకూర్చేలా మార్క్ఫెడ్ అధికారులు ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.

ప్రతి సంవత్సరం అధికారులు ఈ తీరుగానే వ్యవహరిస్తున్నట్టు జిల్లా రైతంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బడా వ్యాపారులకు పెద్ద రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ విధానం అమలు చేయడంపై చిన్న సన్నకారు రైతులు  తీవ్రంగా నష్టపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికే 80 శాతం రైతులు పంటను విక్రయించుకోవడంతో దళారుల వద్ద ఉన్న పంటను తిరిగి రైతుల పేరుతో రీసైక్లింగ్ చేసి అక్రమాలకు తెరలెత్తునట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా పంట కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు