19-09-2025 12:13:58 AM
వెల్దండ సెప్టెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిని జిల్లాలో పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ స్పష్టం చేశారు. గురువారం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించి అధికారులతో మాట్లాడి భూ సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతితో భూ సమస్యలన్నీ పరిష్కారమై రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
సదస్సులలో 17వేలకు పైగా రైతుల నుంచి వివిధ రకాల సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. అందులో 3 వేలు సాదా బైనామ, 5 వేలు అసైన్డ్ అసైన్డ్ భూముల, 9 వేలు సాధారణ భూ స మస్యలపై అర్జీలు వచ్చాయని అందులో 15 వందల అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామన్నారు.
భారతిని పగడ్బందీగా అమలు పరచడం కోసం వీఆర్వోల స్థానంలో క్లస్టర్ల వారిగా 189 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించడం జరిగింది. వారికి తోడుగా లైసెన్స్ డు సర్వేయర్లను నియమిస్తున్నట్లుతెలిపారు.