31-01-2026 12:16:47 AM
రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (విజయక్రాంతి); మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తరలిస్తున్న డబ్బులు గుర్తించిన లీసులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ. 20 లక్షలు నగదును పో లీసులు పట్టుకొని సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం రగుడు వద్ద నిర్వహిస్తున్న ఎస్‌ఎస్ టి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టిజి 23 ఏ 1524 నంబర్ గల కారును పోలీసు బృందం ఆపి తనిఖీ చేయగా కారు యజమాని అయిన సంభాశివ్ గణాచారి డ్రైవ్ చేస్తుండగా కారు లో లెక్కల్లో లేని అనుమానాస్పదంగా ఉన్న రూ.20 లక్షల నగదును తీసుకెళుతున్నట్టు గుర్తించారు.
ఈ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు అలాగే చట్టపరమైన విధానాల ప్రకారం ఎస్ ఎస్ టి బృందం ఇన్చార్జి జి ఆనంద్, ఏపీవో సమక్షంలో మధ్యవర్తుల పంచనామ సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి వేములవాడ పట్టణానికి చెందిన వారు గా తెలిపారు. ఆ నగదు యొక్క మూలం అలాగే ఉపయోగ ఉద్దేశం తెలుసుకునేందుకు తదుపరి విచారణ దర్యాప్తు సాగుతున్నట్టు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే కృష్ణ వెల్లడించారు.