calender_icon.png 24 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోవా ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఏఐ

24-09-2025 12:42:02 AM

పిండం ఎంపికలో కచ్చితత్వం, గర్భస్థ ఫలితాల్లో మెరుగుదలకు ఏఐ ఉపయుక్తం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకోవడం, తద్వారా గర్భస్థ ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ తమ ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టిం ది. అంతర్జాతీయ పరిశోధనల ఫలితాల ప్రకారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫలితంగా గర్భస్థ ఫలితాలు 12% మెరుగుపడ్డాయని తేలింది.

బంజారాహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని తమ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో నోవా ఈ ఏఐని ప్రవేశపెట్టింది. బంజారాహిల్స్ కేంద్రం క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ.. “మన దేశంలో ప్రతి నాలు గు జంటల్లో ఒకరికి సంతానరాహిత్య సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఫెర్టిలిటీ చికిత్సల్లో మరింత కచ్చితత్వం అవసరం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్లో ఏఐని సమకూర్చుకున్నాం” అని చెప్పారు.

ఇది మరింత కచ్చితంగా అంచనా వేయడం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్తలు (ఎంబ్రియాలజిస్టులు) పిండాన్ని ఎంచుకోగలరు అని చెప్పారు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో, 90% ఐవీఎఫ్ సైకిళ్లను ఆ జంట సొంత అండాలు, శుక్రకణాలతోనే చేస్తాం. తద్వారా పిండం ఎంపికలో కచ్చితత్వాన్ని పెంచుతామన్నారు. సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గ వైట్ల మాట్లాడుతూ.. “మొత్తం ఫెర్టిలిటీ కేసుల్లో మగవారి వల్ల వచ్చే సమస్యలు 30--40% ఉంటున్నాయి.

మహిళల్లో 25--30% మం దికి పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, అండా లు తక్కువగా విడుదల కావడం లాంటివి ఉంటున్నాయి. జంటలు తప్పనిసరిగా తమ ఫెర్టిలిటీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి, చికిత్సలకు ఆల స్యం చేయకూడదు” అని చెప్పా రు. కాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఏఎస్‌రావు నగర్ ప్రాంతా ల్లో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రాలున్నాయి. తెలంగాణలోని వరంగల్లో కూడా నోవా ఐవీఎఫ్ తన ఉనికిని విస్తరించింది.