calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదపుటంచున లక్ష్మీదేవి చెరువు

24-09-2025 12:41:01 AM

  గజ్వేల్, సెప్టెంబర్ 23: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్ట ప్రమాదపుటంచునకు చేరింది. చెరువు కట్ట తెగిపోతున్న విషయాన్ని గుర్తించి గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా కంటి తుడుపు చర్యగా మట్టి పోసి వెళ్లిపోయారు. మళ్ళీ కురిసిన వర్షాలకు ఆ మట్టి కూడా జారిపోవడంతో గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు కలిసి ట్రాక్టర్లతో మట్టిని పోసి ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

చెరువు కట్ట తెగిపోతే చెరువు కింద ఉన్న సుమారు 250 ఎకరాల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా కోసం కష్టాలు పడుతూ పంటలను పండిస్తున్నామని, కష్టపడి సాగు చేసిన పంట కొట్టుకుపోతే దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటారని వెల్లడించారు. ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ స్పందించి పటిష్ట చర్యలు చేపడితే గాననీ ప్రమాదాన్ని నివారించలేమని రైతులు వెల్లడిస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.