24-09-2025 12:42:18 AM
గ్రంథం ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్టుమెంటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు వరకు వృత్తితో పాటు ప్రవృత్తిలో భాగంగా అనేకమంది వివిధ కళలలో రాణిస్తున్నారు. అలాంటివారిలో ఒక్కొక్కరి ప్రతిభ ఆధారంగా వారు సాధించిన విజయాలను తెలియజేస్తూ ‘ఖజానాలో కళాకారులు’ అనే గ్రంధాన్ని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ఖాజానా డిప్యూటీ డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణ రచించారు.
ఆ గ్రంథాన్ని మంగళవారం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ రాష్ట్ర డైరెక్టర్ కెఎస్‌ఆర్‌సి మూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ నాగరాజు, ఖమ్మం జిల్లా టిజిఓ కార్యదర్శి మోదుగు వేలాద్రి సుధీర్ బాబు,
షాబుద్దీన్, నరసింహ చారి, పర్వతాలు రాజగోపాలచారి, రవీంద్రగౌడ్, లావణ్య, రాధా, మహమ్మద్ రఫీ, జయరాం గురు జగదీశ్వర్, సాయికుమార్, రాజా, జ్యోతిరావు, అజార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిజిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ భానోతు దస్రు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ప్రసన్నకుమార్, అమృత, సాత్విక్ పాల్గొన్నారు.