calender_icon.png 24 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోదలో ఏఐ- లంగ్ నోడ్యూల్ క్లినిక్

24-11-2025 12:00:00 AM

  1. హైటెక్ సిటీ హాస్పిటల్స్-లో ప్రారంభించిన యశోద ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్‌రావు
  2. చాలా ఆలస్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ల గుర్తింపు

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ప్రధా న ఊపిరితిత్తుల వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి సకాలంలో చికిత్సా నిర్వహ ణ లక్ష్యంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ క్యూర్.ఏఐ, ఆస్ట్రా జెనెకా సహకారంతో అ త్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్‌రావు ఆదివారం ప్రారంభించారు.

ఈ అధు నాతన లంగ్ నోడ్యూల్ క్లినిక్‌లో ఇమేజింగ్- టు-కేర్ మార్గంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పొందుపరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక ప్రధాన కార ణంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

దీనికి, ప్రధాన కారణం ఊపిరితిత్తుల క్యాన్స ర్ చాలా ఆలస్యంగా నిర్ధారణ కావడమే అన్నారు. భారతదేశంలో దాదాపు 80% ఊపిరితిత్తుల క్యాన్సర్లు చాలా ఆలస్యంగా గుర్తించబడటంతో చికిత్సలు క్లిష్టంగా మారుతున్నాయని తెలిపారు. ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్లను మాత్రమే కాకుండా ఇతర సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులను కూడా ముం దస్తుగా గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. తద్వారా రోగులు సకాలంలో తగిన చికిత్స పొందేలా వీలు కల్పిస్తుందని డాక్టర్ జీఎస్ రావు తెలియజేసారు.

యశోదహాస్పిటల్స్ -హైటెక్‌సిటీ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వీ నాగార్జున మాటూరు మాట్లాడుతూ.. ‘లంగ్ నోడ్యూల్ (3 సెం.మీ కంటే తక్కువ చిన్న, గుండ్రని గాయాలు) ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభం రేడియోలాజిక్ సూచికలు అయినప్పటికీ, అవి ఛాతీఎక్స్- కిరణాల్లో గుర్తించ డం సవాల్‌గా ఉండవచ్చు లేదా రొటీన్ హాస్పిటల్ వర్క్ ఫ్లోస్‌లో దాని ప్రాధాన్యతను కోల్పోవచ్చు.

ఈ ఆలస్యమే రోగ నిర్ధారణకు దారితీస్తుంది’ అని తెలిపారు. ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత లంగ్ నోడ్యూ ల్ క్లినిక్‌లో ఫలితాలను సకాలంలో గుర్తించడం, రిస్క్ స్ట్రాటిఫికేషన్, స్ట్రక్చర్డ్ ఫాలో-అప్‌ను నిర్ధారించడానికి ఇమేజింగ్, కేర్ పాత్వే అంతటా ఏఐ- ఎనేబుల్ సిస్టమ్ ఏకీకృతమైందన్నారు.

అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్ అమలు చేసినప్పటి నుంచి, ఏఐ వ్యవస్థ 17,000 ఛాతీ ఎక్స్- కిరణాలను విశ్లేషించిందని, 960 ఊపిరితిత్తుల నోడ్యూల్స్‌ను గుర్తించిందని డాక్టర్ నాగార్జున తెలిపారు. యశోద హాస్పిటల్స్‌లోని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ బృందం రేడియల్ ఎండోబ్రోన్చియల్ అల్ట్రాసోనోగ్రఫీ, వంటి అత్యాధునిక సాధనాలను ఉప యోగించి చిన్న గాయాలనూ కచ్చితంగా  నిర్ధారిస్తుందని పేర్కొన్నారు.