24-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 23(విజయక్రాంతి) : తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మూడో బ్రాంచ్‌ను సం తోష్ నగర్‌లో ఆదివారం ప్రారంభమైంది. ఈ బ్యాంక్ మూడో బ్రాంచ్‌ను ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ, అతిథులుగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, సినీ నటులు సుమన్, ఐఎఫ్‌ఎస్ రిటైర్డ్ అధికారి మల్లికార్జున్ రావ్ హాజరై ప్రారంభించారు.
రాబోయే కాలంలో జంట నగరాలలో ఖాతాదారులకు మరింత సేవలందించడానికిమరో మరో రెండు శాఖలను ప్రారంభిస్తామని బ్యాంక్ చైర్మన్ నంగు నూరు చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మలక్‌పేటలో తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని 23 సెప్టెంబర్ 1998లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ శ్రీ రంగరాజన్ చేతుల మీదుగా ప్రారంభించామని తెలి పారు.
తిరుమల బ్యాంక్ సంస్థాపకులుగా శ్రీ నంగునూరి చంద్రశేఖర్, ఈ బ్యాంకుకు దార్శనికులుగా ప్రముఖ చలనచిత్ర నటులు కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరావు, ప్రముఖ పారిశ్రామికవేత మైహోమ్ రామేశ్వరావు ఉన్నారని చెప్పారు. తిరుమల బ్యాంకును స్థాపించి నేటికి 27 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుందని, 28 సంవత్స రంలో అడుగుపెట్టిందని బ్యాంచ్ చైర్మన్ తెలిపారు.
తిరుమల బ్యాంక్ ప్రారంభించినప్పటి నుంచి అచెంచలమైన నిబద్ధతతో పనిచేస్తుందని, ఖాతాదారుల ఉన్నత ప్రమాణలను స్థి రంగా కలిగి ఉండడం, సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం తిరుమల బ్యాంక్ లక్ష్యమన్నారు. ఈ బ్యాంకు గర్వకారణం ఏంటి అంటే వాటాదారులకు రివార్డులు అందిస్తుందని, 12 శాతం నిరంతర డివిడెంట్‌లతో బలమైన ఆర్థిక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
తిరుమల బ్యాంక్ సు మారుగా ఇప్పటివరకు రూ.75 కోట్ల బిజినెస్‌తో ఖాతాదారులకు మద్దతుగా నిలబడు తోందని, మధ్యతరగతి, దిగువ తరగతి ఖా తాదారుల కోసం ఎప్పటికప్పుడు అడ్వాన్స్ స్కీమ్‌లతో వారికి చేరువ అవుతోందన్నారు. తిరుమల బ్యాంకు ఏటీఎం సేవలే కాకుండా డిజిటల్ సేవలు, ఈకామర్స్, పీఓఎస్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఏ సేవలు, గూగుల్, ఫోన్‌పే వంటి సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. రాబోయే కాలంలో జంట నగరాలలో మరో రెండు శాఖలతో ఖాతాదారుల ముందుకి వస్తానని చైర్మన్ నంగు నూరు చంద్రశేఖర్ తెలిపారు.