calender_icon.png 2 December, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి పాదయాత్ర

02-12-2025 01:45:35 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా.చీమ శ్రీనివాస్

ముషీరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాం తి): డిసెంబర్ 9లోపు ఉద్యమ కారులకి ఇచ్చి న హామీలను అమలు చేయకపోతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీని వాస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

డిసెంబర్ 3న శ్రీకాంతచారి వర్ధం తి సందర్భంగా అలకాపురి అష్టలక్ష్మి కమాన్ నుంచి శ్రీకాంతాచారి విగ్రహం వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి ఉద్యమ స్పూర్తి పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ యాత్రలో ప్రతి ఉద్యమకారుడు కారుని పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ఉద్యమకారులందరు ఐక్యం కావలసిన సమయం వచ్చిందని ఉద్యమకారులను నిర్ల క్ష్యం చేస్తే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశం లో ఫోరం నాయకులు కొండా స్వామి, కొంతం యాదిరెడ్డి జి.  దయానంద్, విష్ణు వర్ధన్, జగన్ యాదవ్,  జానకి రెడ్డి, శివకుమార్ నేత, పుట్నాల కృష్ణ, భాను ప్రకాశ్ రెడ్డి, నవీన్‌చారి పాల్గొన్నారు.