02-12-2025 12:14:26 AM
10 గ్రాండ్ చాంపియన్ షిప్ ట్రోఫీలను సాధించిన విద్యార్థులు
జడ్చర్ల, డిసెంబర్ 1: పట్టణంలో జరిగిన కరాటే చాలెంజర్ కప్ లో జిల్లా కేంద్రానికి చెందిన కింగ్ షోటోకాన్ కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచి గ్రాండ్ చాంపియన్ షిప్ లు సాధించినట్లు ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ తెలిపారు. ఈ పోటీల్లో 10 మంది విద్యార్థులు గ్రాండ్ చాంపియన్ షిప్ లు సాధించినట్లు తెలిపారు.
కతాస్ బాలుర విభాగం వ్యక్తిగత బ్లాక్ బెల్టులో అర్ష్ జమీల్ గ్రాండ్ చాంపియన్ షిప్, బ్రౌన్ బెల్టులో అమాన్ ఖాన్, గ్రాండ్ చాంపియన్ షిప్, బ్లూబెల్టులో మహ్మద్ షరీఫ్ గ్రాండ్ చాంపియన్ షిప్, పర్పుల్ బెల్టులో జుల్ఫికర్ గ్రౌండ్ చాంపియన్ షిప్, బ్రౌన్ బెల్టులో సాబేర్ పాష గ్రాండ్ చాంపియన్ షిప్, వైట్ బెల్టులో అబూబకర్ గ్రాండ్ చాంపియన్ షిప్, బాలికల్లో పర్పుల్ బెల్టులో హప్సా బేగం గ్రాండ్ చాంపియన్షిప్, బ్లూబెల్టులో అయేషాబేగం గ్రాండ్ చాంపియన్షిప్, గ్రీన్ బెల్టులో ఖిల్టులో గ్రాండ్ చాంపియన్ షిప్, వైట్ బెల్టులో అఫిపా కౌసర్ గ్రాండ్ చాంపియన్ షిప్ సాధించినట్లు తెలిపారు.
అదే విధంగా ఇతర విభాగాల్లో గుల్ ఫిషా ఆరెంజ్ బెల్టులో బంగారు పతకం, అహ్మద్ వైట్ బెల్టులో బంగారు. పతకం, బ్రౌన్ బెల్టులో ఖాసీం అలీ బంగారు పతకం, వైట్ బెల్టులో అయాన్‌అలీ బంగారు పతకం, గ్రీన్ బెల్టులో బిలాల్ అజీమ్ బంగారు పతకం, ఎల్లో బెల్టులో అజీజ్ రజత పతకం, కే.తనిష్ కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.
పతకాలు సాధించిన విద్యార్థులు గత కొన్నేళ్ల నుంచి జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో తనవద్ద కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గేమ్స్లలో రాణించి మరియు అంతర్జాతీయ స్థాయిలలో నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియా ఇతర దేశాల టోర్నమెంట్లో రన్నియించి పతకాలు సాధించినట్లు శిక్షకుడు జాంగిర్ భాషా ఖాద్రి తెలిపారు.