02-12-2025 12:43:46 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 1: అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమవుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అర్వపల్లిలో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అడ్డంకులను అధిగమిద్దాం- ఎయిడ్స్ ప్రతిస్పందనని మారుద్దాం.. అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లా డుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా నివారణ మందులు వాడాలని, ఆసుపత్రిలో వాటిని ఉచితంగా అందజేస్తారని అన్నారు. సీహెచ్‌ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునిత, మాధవి, చొక్కయ్య, శ్రీనివాస్, అనూష, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌ను ద్వేషించండి రోగులను కాదు
నూతనకల్ డిసెంబర్ 1: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిడ్స్ నివారణ మార్గంగా మండల వైద్యాధికారి లిఖిత్ ప్రతిజ్ఞ చేయించారు. ఎయిడ్స్ వ్యాధిని ద్వేషించాలి కానీ ఎయిడ్స్ రోగులను కాదని కోరారు. ప్రతి ఒక్కరు అవగా హన కలిగి ఉండాలి అన్నారు. సిహెచ్‌ఓ చరణ్ నాయక్ వైద్య సిబ్బంది ఉన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో..
తుంగతుర్తి, డిసెంబరు 1: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఎయిడ్స్ మహమ్మారిని ద్వేషించండి రోగుల పట్ల జాలి చూపండి అని నినాదాలు చేస్తూ, వీధుల గుండా కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ నరసింహ చారి, సోనీ, అజయ్ పాల్గొన్నారు.
ఆలేరు..
ఆలేరు, డిసెంబర్1 (విజయ క్రాంతి): సోమవారం ప్రపంచ ఏయిడ్స్ దినం సందర్భంగా ఆలేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు, ఎన్సిసి కాడెట్లు ఏయిడ్స్ వ్యాధిపై ఏర్పాటు చేసిన అవగాహన, ప్రాణాంతకమైన ఏయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు ఆ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, ఎన్ సి సి అధికారి దూడల వెంకటేశ్ అన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పాఠశాల ఇంచార్జి హెచ్‌ఎం రావుల సత్యనారాయణ రెడ్డి, రెడ్డిపల్లి సైదులు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన హక్కు అని, అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఏయిడ్స్ మహమ్మారిని తరిమికొ ట్టాలని సూచించారు. ఉపాధ్యాయు లు నరేంద్ర స్వామి, జిత్త సైదులు, పరమేష్, శంకర్ రెడ్డి, మేఘరాజు, శ్రీదర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.