02-12-2025 12:44:32 AM
-దగ్ధమైన 50 గుడిసెలు
శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చందానగర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ నిర్మాణ సంస్థ పలు భారీ భవన సముదాయాలు నిర్మిస్తోంది. అందు లో పనిచేసే కార్మికులంతా అక్కడే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.
సోమవారం కార్మికులంతా పనుల్లో మునిగి ఉండగా.. ఒక్కసారిగా అక్కడి గుడిసెలకు నిప్పు అంటుకొని తగలబడిపోయాయి. దాదాపు 50 గుడిసెలు ఉన్నట్టుగా సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉంటుందని పోలీసులు ప్రా థమికంగా అంచనా వేస్తున్నారు.