calender_icon.png 2 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు శాంతియుతంగా జరగాలి: ఎస్పీ నరసింహ

02-12-2025 12:41:07 AM

చివ్వెంల, డిసెంబర్ 1 : చివ్వెంల మండలంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును సమీక్షించిన ఎస్పీ, గ్రామ ప్రజలు మరియు అభ్యర్థులకు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు.

బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే 25 లక్షల పూచీకత్తు విధిస్తామని హెచ్చరించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటును స్వేచ్ఛగా వినియోగించాలని, అభ్యర్థులు కూడా ప్రజలను ప్రలోభాలకు గురిచేయరాదని సూచించారు. ఎన్నికల ముందు 44 గంటలు ప్రచారం నిషేధం ఉంటుందని, ఈ సమయంలో గుంపులుగా చేరరాదని ఎస్పీ సూచించారు. ఈయనతో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్త్స్ర మహేష్ తదితరులు ఉన్నారు.