17-01-2026 04:03:21 AM
సికింద్రాబాద్ జనవరి 16 (విజయ క్రాంతి) : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎన్ వెంకటేష్ అన్నారు. రోడ్డు ప్రమా దాలను నివారించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ సుబ్బయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ సుబ్బయ్య మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లు, సురక్షిత ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని సూ చించారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ డిపో, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయాలలో అధికారులు, సిబ్బందితో ఇన్‌స్పెక్టర్ ప్రమాణ పత్రంతో చదువుతూ వారి చేత, ‘నేను ట్రాఫిక్ భద్రతానియమాలు పాటిస్తా. హెల్మెట్, సీటుబెల్ట్ ధరిస్తా. మద్యం తాగి వాహనం నడపకుండా ఉంటా. నా ప్రాణం కాపాడుకుని, ఇతరుల ప్రాణాలు కాపాడుతా. ప్రమాదాలను నివారిస్తా’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, కంటోన్మెంట్ బోర్డ్ జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.