calender_icon.png 27 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత చాకలి ఐలమ్మ

27-09-2025 12:00:00 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ  130వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీర వనిత తెలంగాణ మహిళలకు ఆదర్శంగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించడం జరిగిందని పేర్కొన్నారూ.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు,రజక సంఘాల ప్రతినిధులు,మహిళలు పాల్గొన్నారు.