15-08-2025 01:24:51 AM
- రెవెన్యూ అధికారులతో వాగ్వాదం
- సర్వే వాయిదా
- పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్,సిటీబ్యూరో ఆగస్టు 14 (విజ య క్రాంతి):పాతబస్తీలోని చారిత్రక పంచలింగాల దేవస్థానానికి చెందిన భూముల సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో రెవెన్యూ, సర్వే అధికారులు పోలీసు బందోబస్తు నడుమ భూములను సర్వే చేసేందుకు రాగా, ఎంఐఎం నాయకులు తమ అనుచరులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇది తమకు చెందిన భూమి అని, ఇక్కడ సర్వే చేయడానికి వీల్లేదంటూ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
దీంతో అక్కడ హై డ్రామా నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు సర్వేను తాత్కాలికంగా వాయిదా వేశారు.శతాబ్దాల చరిత్ర కలిగిన పంచలింగాల దేవస్థానానికి పాతబస్తీలో కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నట్లు దేవాదాయ శా ఖ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూముల్లో చాలావరకు అన్యాక్రాంతమైనట్లు ఆరోపణ లు రావడంతో, వాటిని గుర్తించి, హద్దులు ని ర్ణయించేందుకు దేవాదాయ శాఖ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తహసీల్దార్ నేతృత్వంలో సర్వే అధికారులు, భారీ పోలీసు బందోబస్తుతో పంచలింగాల దేవస్థా నం వద్దకు చేరుకున్నారు.
సర్వే పనులు ప్రా రంభించబోతున్న తరుణంలో, స్థానిక ఎంఐ ఎం నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకున్నారు. ఈ భూమి దేవస్థానానికి చెందింది కాదు, ఇది ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం, ఇక్కడ సర్వే ఎలా చేస్తారు? అంటూ రెవెన్యూ అధికారుల ను నిలదీశారు. సర్వేకు సంబంధించిన పత్రా లు చూపించాలని, ఏకపక్షంగా సర్వే చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. తమ వద్ద కూడా భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు ఉన్నాయని వాదించారు.
దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు, ఉన్నతాధికారుల సూచనలతో సర్వే బృందం వెనుదిరి గింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని సద్దుమణిగించారు. అయితే, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడంపై తీవ్ర విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.
దేవాదాయ భూములను కబ్జా చేసేందుకే ఎంఐఎం కుట్ర పన్ను తోందని, సర్వేను నిలిపివేయడం దారుణమ ని బీజేపీ, హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సర్వేను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు, జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. న్యాయ నిపుణు ల సలహా తీసుకుని, మరింత పటిష్టమైన పో లీసు భద్రతతో త్వరలోనే సర్వేను పూర్తి చేస్తామన్నారు. ఈ ఘటనతో పంచలింగాల దేవస్థానం భూముల వివాదం మరోసారి పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది.