08-05-2025 12:34:18 AM
న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద శిబిరా లపై భారత్ దాడులు ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో తమ సాయుధ దళాల కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధ వారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీలో భారత్ వైమానిక దాడులకు ఆత్మరక్షణ కోసం ప్రతిస్పందించే హక్కు ను తమ దేశం కలిగిఉందని ప్రకటించింది.
భారత్ దాడులను ‘నగ్న దురాక్రమణ’గా పేర్కొంటూ ఖండించింది. మహిళలు, పిల్ల లు సహ దాడులు చేసిందని ఆరోపించింది. పాకిస్థాన్ ప్రాదేశిక సమగ్రతను భారత్ ఉ ల్లంగించిందని ఆరోపించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధచర్యలుగా పేర్కొంది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వెంబడి ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం భారీ దాడులకు పాల్పడిందన్నారు.