04-12-2025 02:01:51 AM
యంగ్ హీరో తిరువీర్ ఇటీవల ‘ప్రీ వెడ్డింగ్ షో’తో అలరించారు. ఈ ఏడాది ఆరంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు పొందిన మేకర్స్ తాజాగా ఈ సినిమా టైటిల్ ‘ఓ..! సుకుమారి’ అని రివిల్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను టీమ్ సోషల్‌మీడియాలో పంచుకుంది. ఝాన్సీ, మురళీధర్‌గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ‘రజాకార్’, ‘పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సీహెచ్ కుషేందర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూర్చుతున్నారు. ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం తిరుపతి ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్. ‘క’ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీవరప్రసాద్ ఎడిటర్ కాగా, పూర్ణాచారి పాటలు రాస్తున్నారు.