calender_icon.png 4 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగులో మరో సినిమా!

04-12-2025 02:00:19 AM

తనదైన ప్రతిభతో ప్రపంచవ్యాప్త సినీప్రియుల మనసుదోచుకోడమే కాక అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనూ ఈ ముద్దుగుమ్మది ప్రత్యేక స్థానమే. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇటు బాలీవుడ్ నుంచి అటు హాలీవుడ్ దాకా అన్ని చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-తో జతకడుతోంది.

ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం ‘వారణాసి’లో ప్రియాంక మందాకిని అనే పాత్రలో కనిపించనుంది. మహేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం ఈ చిత్రంతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా మరో తెలుగు సినిమాకూ సైన్ చేసింది! దర్శకుడు నాగ్‌అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘కల్కి 2’ కోసం ప్రియాంకను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ‘కల్కి’ తొలి భాగంలో నటించిన దీపికా పడుకొణె పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నారని తెలుస్తోంది.