calender_icon.png 4 December, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారా తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్ పోలీసుల దాడులు

04-12-2025 12:57:11 AM

మద్యం, బెల్లం స్వాధీనం 3 కేసులు నమోదు 

కల్వకుర్తి డిసెంబర్ 3: గ్రామ పంచాయతీ ఎన్నికల దృశ్య గ్రామాల్లో మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై, సారా తయారీ కేంద్రాలపై నాగర్ కర్నూల్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్, కల్వకుర్తి ఎక్సైజ్ పోలీసులు దాడుల ముమ్మరం చేశారు. బుధవారం కల్వకుర్తి మండలం గుండూరు, ఎల్లికట్ట, తోటపల్లి గ్రామాల్లో దాడులు నిర్వహించి 21 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

వెల్దండ మండలం పోచమ్మ తండా, సిలోని భావితండ, లింగారెడ్డి పల్లిలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 600 లీటర్ల బెల్లం , 150 కిలోల బెల్లం , 15 కిలోల పట్టిక, ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.