calender_icon.png 4 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

04-12-2025 12:55:57 AM

చారకొండ డిసెంబర్ 3: డిండి నార్లాపూర్ ఎత్తిపోతలో భాగంగా చారగొండ మండలం లోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి తమ గ్రామానికి ముంపు నుంచి కాపాడాలని కోరుతూ మండలంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు స్థానిక సంస్థల పంచాయితీ ఎన్నికలను బహిష్కరించి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న తమ ఆవేదనను పట్టించుకోకుండా పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఆర్ & ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమకు న్యాయం జరిగే వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.