23-12-2025 12:35:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఏ దేవాలయానికి పది మై ళ్ల పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపా దుల మహత్తర ఆశయానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొని యాడారు. సోమవారం వరంగల్‌లోని అక్షయపాత్ర ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీకృత వంటశాలలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక సహకారంతో సమకూరిన అత్యా ధునిక వంట పరికరాలను, నూతన కార్యాలయ భవనాన్ని, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు వంటశాల మొత్తం కలియతిరిగారు. అక్కడ ఆహారం తయారవుతున్న విధానం, పాటిస్తున్న పరిశుభ్రత ప్ర మాణాలను చూసి మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం 15 నిమిషాల్లో 1,000 మం ది పిల్లలకు సరిపడా అన్నం వండే ఆటోమేటెడ్ బాయిలర్లు, రెండు గంటల్లోపే 5,000 మందికి సాంబార్ తయారు చేసే భారీ కౌల్డ్ర న్లు, ఆటోమేటిక్ వెజిటబుల్ కటింగ్ మిషన్లు, కూరలు వండే యంత్రాలను ఆమె ఆసక్తిగా పరిశీలించారు.
అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన రెండు ఆహార రవాణా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.మంత్రి కొం డా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారదలు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. మంత్రి మాట్లాడు తూ.. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా తరగతి గదుల్లోనే కడుపు నిండా రుచికరమైన భోజనం అందిస్తున్న అక్షయపాత్ర సంస్థకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.
వంటశాల సామర్థ్యాన్ని పెంచేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించిన సహకా రం అభినందనీయమని అక్షయపాత్ర రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ తెలిపారు. ఈ కొత్త పరికరాల వల్ల వరంగల్, హనుమకొండ, భీమదేవరపల్లి మండలాల్లోని 367 ప్రభుత్వ పాఠశాల లు, 550 అంగన్వాడీ కేంద్రాల్లోని సుమారు 26,000 మంది చిన్నారులకు వేగంగా, వేడివేడిగా భోజనం అందుతుందని చెప్పారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఆదా అవుతుండగా, జీరో వేస్ట్ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నారు. పిల్లల ఆరోగ్య భద్రత కోసం సొంతంగా ఆర్వో ప్లాంట్, క్వా లిటీ టెస్టింగ్ ల్యాబ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్థన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధులు సత్య రమణన్ హెడ్-ఎమర్జింగ్ మార్కెట్స్, సాయి ఆకాష్, టీవీఎస్ శ్రీధర్ పాల్గొన్నారు.