calender_icon.png 23 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర సమయాల్లో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించవచ్చు

23-12-2025 12:36:49 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

బూర్గంపాడు, డిసెంబర్ 22, (విజయక్రాంతి): విపత్తుల సమయంలో సమర్థవంత మైన స్పందనకు మాక్ డ్రిల్ విజయవంతంబూర్గంపాడు మండల కేంద్రంలో సోమవా రం విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన కోసం విస్తృత స్థాయి మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యక్షంగా పాల్గొని, ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా అన్ని శా ఖల చర్యలను పర్యవేక్షించారు. మాక్ డ్రిల్ను ఫైర్ శాఖ అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో, అబ్జర్వర్గా ఎన్డీఆర్‌ఎఫ్ కమాండర్ సుఖేందర్ దత్ పర్యవేక్షణలో నిర్వహించబడింది. క్షేత్ర స్థాయిలో ఈ మాక్ డ్రిల్ బూ ర్గంపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతం లో జరిగింది.

ఇందులో ప్రజలను సురక్షితం గా రక్షించడం, లైఫ్ జాకెట్లు, బోట్లు ఉపయోగించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, అవసరమైన వైద్య సేవలు, త్రా గునీరు, భోజనం, తాత్కాలిక నివాసం వంటి సేవలను డెమో రూపంలో ప్రదర్శించారు. వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో సేవలను బాధితులకు అందించడం, ఫైర్, ఇరిగేషన్, గజ యితగాళ్ల పాత్రను, వారు చేపట్టే అత్యవసర చర్యలను ప్రాక్టికల్గా ప్రదర్శించారు. పునరావాస కేంద్రాల్లో బాధితు లకు త్రాగునీరు, భోజనం, అత్యవసర వైద్య సేవలు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను డెమో రూపంలో చూపించారు.

బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిబ్బంది ,రెవెన్యూ సి బ్బంది పాల్గొని, బాధితులకు అవసరమైన ఏర్పా ట్లు, సహాయ సేవలను సమన్వయంతో అందించారు.బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పా టిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యవ సర సమయంలో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించవచ్చని, యువత, విద్యార్థు లు, శాఖల అధికారులు సమన్వయంతో చు రుగ్గా పాల్గొనాలి అని చెప్పారు.

ఎన్సిసి వి ద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, అత్యవసర పరిస్థితుల్లో వారు ఏ విధంగా స్పందించాలో, ఎలాంటి చర్యలు చేపడతారో తెలుసుకున్నారు. మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యం త్రాంగం అత్యవసర పరిస్థితులలో సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయగల సామ ర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవ డానికి ఇలాంటి మాక్ డ్రిల్లు కీలకమని కలెక్టర్ తెలిపారు.

ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడు తూ, విపత్తుల సమయంలో అన్ని బృందా లు సమన్వయంతో పనిచేయాలి, ఆధ్యాత్మిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి అని తెలిపారు. ప్రతి సంవత్స రం వరదలు సంభవించే బూర్గంపాడు లాం టి ప్రాంతాల్లో ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో, అధికారుల్లో వి శ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, పోలీస్ శాఖ సిబ్బంది, ఎన్ డి ఆర్ ఎ ఫ్ అధికారి,సీనయ్య, డిడిఆర్‌ఎఫ్ సిబ్బంది, ఎన్సిసి, ఫైర్, రెవెన్యూ, వైద్యశాఖ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.