23-12-2025 02:19:29 AM
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
మేడ్చల్, డిసెంబర్ 22(విజయ క్రాంతి): మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన గోశాల ను రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గోమాతలు మన సంస్కృతి ప్రతీక అని, గోశాల ద్వారా విద్యార్థులు జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యతలు నేర్చుకుంటారన్నారు.
గ్రామీణ వాతావరణాన్ని గుర్తుంచుకునేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మల్లా రెడ్డి మాట్లాడుతూ గోశాల కళాశాలలో ఆధ్యాత్మిక విలువలు, సామాజిక సేవా భావనను పెంపొందిస్తుందని అన్నారు.. విద్యార్థులు గోవుల సంరక్షణలో చురుకుగా పాల్గొని, స్వావలంబన మార్గాలు స్వీకరించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జే నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం, కోశాధికారి త్రిలోక్ రెడ్డి డా. పి దిలీప్ రెడ్డి , డా రాము, పలు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.